దుబాయ్: ఇరాన్ అత్యంత ఆధునిక యంత్రాలతో యురేనియంను శుద్ధి చేసేందుకు సిద్ధమవుతున్నది. అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఏఈఏ) వెల్లడించిన వివరాల ప్రకారం, ఫోర్డో, నటంజ్లలోని అణు కేంద్రాల్లో వేలాది ఆధునిక యంత్రాలు (సెంట్రిఫ్యూజెస్)తో యురేనియంను శుద్ధి చేయడానికి ఇరాన్ ప్రణాళిక రచించింది.
ప్రస్తుతం 60 శాతం స్వచ్ఛతతో శుద్ధి చేస్తుండగా, కొత్త సెంట్రిఫ్యూజెస్తో కేవలం 5 శాతం శుద్ధ యురేనియం కోసం ప్రయత్నిస్తున్నది. దీనిని బట్టి అమెరికా కొత్త అధ్యక్షుడు ట్రంప్‌తోనూ చర్చలు జరపాలని ఇరాన్ కోరుకుంటున్నట్లు సంకేతాలు వస్తున్నాయి. ఇరాన్ ప్రయత్నాలు ఇజ్రాయెల్‌తో ఉద్రిక్తతలను పెంచే అవకాశాలు ఉన్నాయి.