టెహ్రాన్ : అమెరికా, ఇజ్రాయెల్ మిత్ర దేశాలకు, మద్దతు ఇచ్చే దేశాల నౌకలను హొర్ముజ్ జలసంధి గుండా వెళ్లేందుకు అనుమతించబోమని ఐఆర్జీసీ శుక్రవారం ప్రకటించింది. ఆయా దేశాల నౌకలకు ఆ జలసంధిని మూసేశామని తెలిపింది. ఒకవేళ హొర్ముజ్ గుండా వెళ్లాలని సదరు దేశాల నౌకలు ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలో వివిధ దేశాలకు చెందిన మూడు నౌకలు వెనక్కి మళ్లినట్టు ఇరాన్ మీడియా వెల్లడించింది. తమ మిత్ర దేశాలకు హొర్ముజ్ జలసంధి తెరిచే ఉంటుందని అమెరికా తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నదని ఇరాన్ ఈ సందర్భంగా ఆరోపించింది. హొర్ముజ్ తెరిచేందుకు ఇచ్చిన గడువును పది రోజులు పొడిగిస్తున్నట్టు ట్రంప్ ప్రకటించిన కొన్ని గంటలకే ఐఆర్జీసీ ఈ ప్రకటన చేసింది.