ఇరాన్ శుక్రవారం కూల్చివేసిన అమెరికా ఫైటర్ జెట్ ఎఫ్-15 క్రూ సభ్యుడిని రక్షించడానికి తాము నిర్వహించిన ఆపరేషన్ యూఎస్ చరిత్రలోనే గొప్పదని అగ్రరాజ్యం ప్రకటిస్తుండగా, అదంతా ట్రాష్‌గా ఇరాన్ కొట్టివేసింది. వాస్తవానికి తప్పిపోయిన క్రూ సభ్యుడి గాలింపు పేరుతో ఇరాన్‌లోని శుద్ధిచేసిన యురేనియాన్ని అపహరించేందుకు వెతుకులాట జరిపిందని ఇరాన్ విదేశాంగ శాఖ ఆరోపించింది.
ఈ మేరకు ఆ శాఖ సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. పైలట్ గాలింపు పేరుతో అమెరికా నాటకమాడిందని ఇరాన్ పేర్కొన్నది.