Iran Attack: బాలిస్టిక్ క్షిపణులతో దాడి.. అమెరికా యుద్ధ విమానాలు ధ్వంసం: ఐఆర్జీసీ
Iran Attack: అమెరికాకు చెందిన పలు మిలిటరీ విమానాలను ధ్వంసం చేసినట్లు ఐఆర్జీసీ చెప్పింది. జోర్డాన్‌లో ఉన్న అమెరికా బేస్‌పై అటాక్ చేసినట్లు పేర్కొన్నది. అమెరికా స్థావరాలపై బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లతో దాడి చేసినట్లు ఐఆర్జీసీ ప్రకటించింది.
టెహ్రాన్: ఇరాన్ భారీ దాడి(Iran Attack) చేసింది. అమెరికాకు చెందిన మిలిటరీ విమానాలను ధ్వంసం చేసింది. జోర్డాన్‌లో ఉన్న అమెరికా బేస్‌పై అటాక్ జరిగింది. బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లతో ఇరాన్ దాడి చేసినట్లు ఐఆర్జీసీ ప్రకటించింది. గత రాత్రి జరిగిన దాడులకు ప్రతీకారంగా అమెరికా స్థావరాలపై ఇరాన్ విరుచుకుపడినట్లు తెలుస్తోంది. ఆ దాడుల్లో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇరాన్‌కు చెందిన సుమారు మూడు క్షిపణులను కూల్చినట్లు జోర్డాన్ మిలిటరీ వెల్లడించింది. ఇవాళ జరిగిన దాడి గురించి ఇరాన్స్ రెవల్యూషనరీ గార్డ్స్ ఓ ప్రకటన చేసింది. అమెరికా వైమానిక దళానికి చెందిన అనేక రీఫ్యూయలింగ్ విమానాలు, యుద్ధ విమానాలను ధ్వంసం చేసినట్లు ఐఆర్జీసీ తెలిపింది. సిరియాలో ఉన్న అల్ తానఫ్ అమెరికా స్పెషల్ ఆపరేషన్స్ కమాండ్ సెంటర్‌ను కూడా అటాక్ చేసినట్లు ఐఆర్జీసీ ప్రకటించింది.
వరుసగా ఆరో రోజు గురువారం రాత్రి అమెరికా వైమానిక దాడులు చేసింది. ఇరాన్ మౌళిక సదుపాయాలను టార్గెట్ చేసింది. ఆ దేశంలో ఉన్న అనేక బ్రిడ్జీలను నేలమట్టం చేసింది. అయితే ఈ దశలో ఇరాన్ తీవ్ర హెచ్చరిక చేసింది. ఒకవేళ దాడులు ఉదృతం అయితే, అప్పుడు యావత్ పశ్చిమాసియా ప్రాంతం తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఇరాన్ తన హెచ్చరికలో పేర్కొన్నది. హర్మోజ్‌గన్ ప్రావిన్సులో జరిగిన దాడుల్లో అయిదు బ్రిడ్జీలను అమెరికా విమాన సిబ్బంది పేల్చేసింది. కీలకమైన బందర్ అబ్బాస్ పోర్టు నగరానికి లింకున్న బ్రిడ్జీలను కూల్చివేసినట్లు తెలుస్తోంది.
బహ్రెయిన్‌లోని సాకిర్ ఎయిర్‌బేస్‌లో ఉన్న అమెరికా హెలికాప్టర్లు, రికనయిసెన్స్ విమానాలను ధ్వంసం చేసినట్లు ఇరాన్ చెబుతోంది. మరోవైపు అలారం సైరన్లు మోగించినట్లు బహ్రెయిన్ మంత్రి పేర్కొన్నారు. ప్రజలు సంయమనంతో ఉండాలని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని చెప్పారు. కానీ ఎయిర్‌బేస్ మీద అటాక్ జరిగినట్లు అమెరికా, బహ్రెయిన్ అధికారులు ఇంకా కన్ఫర్మ్ చేయలేదు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- ballistic missiles
- drones
- iran
- IRGC
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

