న్యూయార్క్, నవంబర్ 27: చైనాలోని జెంగ్ఝౌలో ఉన్న అతిపెద్ద ఐఫోన్ల తయారీ ప్లాంట్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ఐఫోన్ల అమ్మకాలపై తీవ్ర ప్రభావం పడుతున్నది. ఉద్యోగుల ఆందోళన, వేల మంది రాజీనామాలతో యాపిల్ ఫోన్ల ఉత్పత్తి తగ్గిపోయింది. దీంతో ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో ఐఫోన్ కొత్త మాడళ్ల కొరత నెలకొన్నది. యాపిల్ ఐఫోన్ 14 ప్రో, 14 ప్రో మ్యాక్స్ వంటి కొత్త మాడళ్లు స్టోర్లలో పెద్దగా కనిపించడం లేదు. దీంతో ఆ ఫోన్లు కొనుక్కుందామని వెళ్తున్న కస్టమర్లు నిరాశగా వెనుదిరుగుతున్నారు. రిటైలర్లు, యాపిల్ స్టోర్లు, ఆన్లైన్ వేదికలపై ఐఫోన్ల కొరత కనిపిస్తున్నదని వెబ్డష్ అనలిస్టు డాన్ ఇవ్స్ పేర్కొన్నారు.