టెహ్రాన్: ఇజ్రాయెల్-అమెరికాతో యుద్ధం కారణంగా ఇరాన్లో ఇంటర్నెట్ వినియోగంపై నిషేధం విధించి నెల రోజులు దాటింది. దీంతో ఆ దేశంలో ఎక్కువ కాలం కొనసాగుతున్న ఇంటర్నెట్ షట్డౌన్గా ఇది నిలిచింది. మానిటర్ నెట్‌బ్లాక్స్ కథనం ప్రకారం.. ప్రపంచంలో అత్యధిక కాలం ఇంటర్నెట్ నిషేధం ఇరాన్‌లోనే కొనసాగింది. ‘అయిదు వారాల తర్వాత కూడా ఇంటర్నెట్ షట్‌డౌన్ కొనసాగుతున్నది.
వైట్ లిస్టింగ్ వ్యవస్థ ద్వారా ఎంపిక చేసిన వినియోగదారులకు ఇంటర్నెట్ సదుపాయాన్ని కల్పించే మార్గాలను అధికారులు అన్వేషిస్తున్నారు. అయితే ఈ పరిస్థితి ఇరానియన్లను ప్రపంచంతో సంబంధం లేకుండా ఏకాకిని చేసింది’ అని నెట్‌బ్లాక్స్ తెలిపింది.