న్యూయార్క్: భూమిని పోలిన రెండు గ్రహాలను అంతర్జాతీయ పరిశోధకులు కనుగొన్నారు. సూర్యుడికి సమీపాన ఉన్న ‘జీజే 1002’ నక్షత్రం చుట్టూ పరిభ్రమిస్తున్న ఈ రెండు గ్రహాలు నివాసయోగ్యమైనవిగా గుర్తించారు. ఇవి సౌర వ్యవస్థ నుంచి 16 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నాయి. అలాగే, ఆ రెండు గ్రహాల ద్రవ్యరాశి మన భూ ద్రవ్యరాశికి సమానంగా ఉన్నట్టు పరిశోధకులు అంచనా వేశారు. వీటికి ‘జీజే 1002బీ’, ‘జీజే 1002సీ’గా నామకరణం చేశారు. ‘జీజే 1002బీ’కు నక్షత్రం చుట్టూ పరిభ్రమించేందుకు 10 రోజులు, ‘జీజే 1002సీ’ పరిభ్రమణ కాలం 21 రోజులుగా పరిశోధకులు తేల్చారు.