న్యూయార్క్, ఫిబ్రవరి 14: బీబీసీ కార్యాలయాలపై ఐటీ దాడులను పలు అంతర్జాతీయ మీడియా, మానవహక్కుల సంస్థలు సైతం ఖండించాయి. మీడియాను బెదిరించేలా, భావప్రకటనా స్వేచ్ఛను కాలరాసేలా ఈ సోదాలు జరుగుతున్నాయని విమర్శించాయి.
ప్రధాని నరేంద్ర మోదీను విమర్శించేలా డాక్యుమెంటరీ తీసినందునే బీబీసీపై కక్షతో ప్రతీకార చర్యలకు పాల్పడున్నారని ఆరోపించాయి. బీబీసీపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని తూర్పారబట్టాయి.