మరణాన్ని జయించేందుకు.. పుతిన్ యాంటీ ఏజింగ్ ప్రాజెక్ట్
గత కొన్నేండ్లుగా రష్యా అధ్యక్షుడు పుతిన్ అమరత్వం గురించి మాట్లాడుతున్నారు. 73 ఏండ్ల వయసున్న పుతిన్ చావును ఎదురించి ఎక్కువ కాలం రష్యా అధ్యక్షుడిగా పనిచేయాలని ఆరాటపడుతున్నారు. ఇప్పటికే మనుషుల అవయవాలపై రష్యా సైంటిస్టులు ఎన్నో ప్రయోగాలు చేస్తున్నారు.
- 26 బిలియన్ రూబుల్స్‌తో ప్లాన్
- 3డీ ప్రింటింగ్‌తో జీవకణాల రూపకల్పన, అభివృద్ధి
- మినీపిగ్స్లో మానవ అవయవాల పెంపు
మాస్కో, మే 29 : గత కొన్నేండ్లుగా రష్యా అధ్యక్షుడు పుతిన్ అమరత్వం గురించి మాట్లాడుతున్నారు. 73 ఏండ్ల వయసున్న పుతిన్ చావును ఎదురించి ఎక్కువ కాలం రష్యా అధ్యక్షుడిగా పనిచేయాలని ఆరాటపడుతున్నారు. ఇప్పటికే మనుషుల అవయవాలపై రష్యా సైంటిస్టులు ఎన్నో ప్రయోగాలు చేస్తున్నారు. ఇప్పుడు చావును జయించేందుకు 26 బిలియన్ల రూబుల్స్ ఖర్చుతో ‘యాంటీ- ఏజింగ్’ ప్రాజెక్టును మొదలు పెట్టారు. 3డీ ప్రింటింగ్ ద్వారా జీవకణాలను సృష్టించి వాటిని డెవలప్ చేస్తారు. ఆ తర్వాత మినీ పిగ్స్‌లో మానవ అవయవాలను పెంచుతారు. రాబోయే రోజుల్లో మనుషుల పూర్తి అవయవాలను కూడా మార్చేందుకు ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుందంట. ఇలా మార్చడం ద్వారా మనుషులు మరణాన్ని వాయిదా వేసుకోవచ్చనేది పుతిన్ ఆలోచన.
పుతిన్ కూతురు నేతృత్వంలో..
ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు పుతిన్ కూతురు మరియా, ప్రముఖ సైంటిస్టు మైఖేల్ కోవాచుక్ నేతృత్వం వహిస్తున్నారు. ఈ ప్రాజెక్టు సక్సెస్ అయిన తర్వాత అవసరం అయితే మనుషుల పూర్తి అవయవాలను మినీ పిగ్స్‌లో పెంచే అవయవాలతో రీప్లేస్ చేయొచ్చని కోవాచుక్ మీడియాతో తెలిపారు. అయితే ఈ ప్రాజెక్టుపై రష్యాలో బయోప్రింటింగ్ వ్యవస్థ సృష్టించిన ప్రముఖ సైంటిస్టు అలెగ్జాండర్ ఓస్ట్రోవ్స్కీ అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు కేవలం కోరికల స్థాయిలోనే ఉందని.. కార్యరూపం దాల్చలేదన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వరల్డ్ బ్యాంక్ బృందం నల్లగొండ క్లాక్ టవర్ జంక్షన్ అభివృద్ధి పనుల పరిశీలన
Mamitha Baiju | అతడి నిర్ణయమే ఫైనల్.. పెళ్లి పుకార్లకు ఫుల్స్టాప్ పెట్టిన మమితా బైజు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

