2013లో వచ్చిన కొరియన్ సినిమా ‘స్నోపీర్సర్’ గుర్తుందా? భూగోళమంతా మంచుతో గడ్డకట్టుకుపోతే, బతికిఉన్న కొద్దిమంది ఓ రైలులో నిరంతరాయంగా ప్రయాణాన్ని కొనసాగిస్తారు. అచ్చం అలాగే, ఇంధనాన్ని నింపుకోవడానికి ఎక్కడా ఆగకుండా నిర్విరామంగా నడిచే ఓ రైలును ఆస్ట్రేలియాకు చెందిన ఓ సంస్థ నిర్మించనున్నది. ‘ఇన్ఫినిటీ ట్రైన్’ పేరిట పిలిచే ఈ రైలు నిర్మాణానికి రూ. 381 కోట్లు ఖర్చు కానున్నది. భూమ్యాకర్షణ శక్తితో బ్యాటరీని రీచార్జింగ్ చేసుకొని నడిచే ఈ రైలు 2030 తర్వాతనే అందుబాటులోకి రానున్నది.