బెర్లిన్: ఇండో-యూరోపియన్ భాషల మూలాల గురించి జర్మనీ శాస్త్రవేత్తలు కొత్త ప్రతిపాదనలను తెరపైకి తీసుకొచ్చారు. ఇండో-యూరోపియన్ భాషలు 8100 ఏండ్ల ప్రాచీనమై ఉండొచ్చని వారు అభిప్రాయపడ్డారు.
జర్మనీలోని మ్యాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎవల్యూషనరీ ఆంథ్రోపాలజీ పరిశోధకులు దీనిపై అధ్యయనం చేశారు. అధ్యయన ఫలితాలను జర్నల్ సైన్స్‌లో ప్రచురించారు. 7 వేల ఏండ్ల క్రితమే ఇండో-యూరోపియన్ భాషలు ఐదు శాఖలుగా విభజన చెందాయని వారు తేల్చారు.