భారత్‌కు 21 ఏండ్ల తర్వాత మిసెస్ వరల్డ్-2022 కిరీటం దక్కింది. ముంబైకి చెందిన సర్గం కౌశల్ ఈ కిరీటాన్ని గెలుచుకున్నారు. అమెరికాలోని లాస్ వెగాస్‌లో నిర్వహించిన అందాల పోటీల్లో 63 దేశాలకు చెందిన భామలు పాల్గొనగా.. సర్గం కౌశల్‌ను కిరీటం వరించింది. పెండ్లి అయిన వారికి నిర్వహించే అందాల పోటీలనే మిసెస్ వరల్డ్ పోటీలు అంటారు.