చాప కింద నీరులా మధుమేహం.. టాప్ 10 దేశాల్లో భారత్
తిందామంటే తిననివ్వదు.. కానీ, ఆకలి మీద ఆకలి. ఓ గంట సేపు కూర్చుందామంటే సరిగా కూర్చోనివ్వదు. కంటి చూపు సరిగా కనిపించదు, గుండె టపటపా కొట్టుకుంటుంది.. చక్కెర వ్యాధితో వచ్చిన చిక్కులివి. ఈ చిక్కులు భారత్‌తో పాటు పది దేశాలకు ఎక్కువగా ఉన్నాయంటున్నారు శాస్త్రవేత్తలు
- ప్రపంచవ్యాప్తంగా 84 లక్షల డయాబెటిస్ బాధితులు
- 2040 నాటికి 1.74 కోట్లకు!
- సిడ్నీ వర్సిటీ సర్వేలో వెల్లడి
మెల్బోర్న్, సెప్టెంబర్ 21: తిందామంటే తిననివ్వదు.. కానీ, ఆకలి మీద ఆకలి. ఓ గంట సేపు కూర్చుందామంటే సరిగా కూర్చోనివ్వదు. కంటి చూపు సరిగా కనిపించదు, గుండె టపటపా కొట్టుకుంటుంది.. చక్కెర వ్యాధితో వచ్చిన చిక్కులివి. ఈ చిక్కులు భారత్‌తో పాటు పది దేశాలకు ఎక్కువగా ఉన్నాయంటున్నారు శాస్త్రవేత్తలు. ముఖ్యంగా టైప్-1 మధుమేహం చాప కింద నీరులా వ్యాపిస్తున్నదని హెచ్చరించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధిబారిన పడ్డవారి సంఖ్య 84 లక్షలకు చేరిందని ఆస్ట్రేలియాలోని సిడ్నీ యూనివర్సిటీ సర్వేలో తేలింది.
అందులో అమెరికా, భారత్, బ్రెజిల్, చైనా, జర్మనీ, యూకే, రష్యా, కెనడా, సౌదీ అరేబియా, స్పెయిన్ దేశాలు తొలి పది స్థానాల్లో ఉన్నాయని వెల్లడైంది. 2040 నాటికి వ్యాధిగ్రస్తుల సంఖ్య కోటి 75 లక్షలకు చేరే ప్రమాదం ఉన్నదని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ ప్రమాదానికి అడ్డుకట్ట వేయాలంటే ఆరోగ్య వ్యవస్థ పటిష్టం కావాలని తెలిపారు. అన్ని దేశాల్లో 100 శాతం చికిత్స విధానాలు అందుబాటులోకి రావాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న మొత్తం కేసుల్లో 21 శాతం మంది అల్పాదాయ, మధ్యాదాయ దేశాలకు చెందినవారేనని వివరించారు. ఈ వ్యాధితో 2021లో 1.75 లక్షల మంది మరణించారని పేర్కొన్నది.

Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
TB | టీబీ వచ్చి తగ్గిన తరువాత శరీరంలో జరిగే మార్పులేమిటి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..
Stalin rejects Oppn pitch | డీలిమిటేషన్‌పై వెనక్కి తగ్గని స్టాలిన్.. ‘ఇండియా’ కూటమి నేతల చర్చలు విఫలం
Health tips | శుభ్రం చేసేటప్పుడు పచ్చి చేప కళ్లను తీసిపారేస్తున్నారా.. అయితే ఈ ప్రయోజనాలను కోల్పోతున్నట్లే..!
KTR | తీగలగుట్టపల్లిలో పోలీసోళ్లు ఎట్లా వస్తరని రాత్రంతా మేల్కొని ఉన్నం : కేటీఆర్
KTR | ఇది యాచించి తెచ్చుకున్న తెలంగాణ కాదు.. శాసించి తెచ్చుకున్న తెలంగాణ : కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

