న్యూజెర్సీ: పెద్దలు కుదిర్చిన వివాహం కోసం అమెరికా వచ్చిన సిమ్రన్ అనే భారత యువతి న్యూజెర్సీలో అనుమానాస్పద స్థితిలో అదృశ్యమైంది. జూన్ 20న ఆమె న్యూజెర్సీకి చేరుకుంది. ఐదు రోజుల తర్వాత నుంచి కనిపించకుండా పోయింది. ఆమె తన ఫోన్ను చెక్ చేసుకుంటూ ఎవరికోసమో ఎదురుచూస్తున్నట్టు కెమెరాలలో కన్పించింది.
ఆ సమయంలో ఆమె ముఖంలో ఎలాంటి ఆందోళన కన్పించ లేదు. ఆమెకు అమెరికాలో బంధువులు లేరు. ఆంగ్ల భాషను మాట్లాడ లేదని పోలీసులు తెలిపారు. భారత్లోని ఆమె బంధువులను కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. అమెరికాకు ఉచితంగా వచ్చేందుకే పెండ్లిని ఒక సాకుగా పేర్కొందా? అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.