లండన్: యూకే యూనివర్సిటీలకు దరఖాస్తు చేసుకునే భారత విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గుతున్నట్టు తాజా సర్వే వెల్లడించింది. బ్రిటన్లో ఆర్థిక సంక్షోభం వల్ల అక్కడి విద్యా సంస్థలు బడ్జెట్ను నియంత్రించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో భారత విద్యార్థులు అక్కడి వర్సిటీల్లో చేరేందుకు విముఖత చూపుతున్నట్టు సర్వే పేర్కొంది.
2022-23లో 1,39,914 మంది భారత విద్యార్థులు బ్రిటన్ యూనివర్సిటీల్లో దరఖాస్తు చేసుకోగా 2023-24లో ఆ సంఖ్య 20.4 శాతం తగ్గి 1,11,329కి పడిపోయింది. కొన్ని నగరాల్లో ఇమ్మిగ్రేషన్ వ్యతిరేక అల్లర్లు, పరిమిత ఉద్యోగాల నేపథ్యంలోనే భారత విద్యార్థుల రాక తగ్గుతున్నట్టు సమాచారం.