Nithisha Kandula | కాలిఫోర్నియా, జూన్ 5: అమెరికాలో గత నెల 28న కనిపించకుండాపోయిన హైదరాబాద్కు చెందిన విద్యార్థిని నితీషా కందుల (23) సురక్షితంగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. మే 28న లాస్ఏంజెల్స్లో నితీషా తప్పిపోయారు. ఎప్పుడు, ఎక్కడ, ఎలా గుర్తించారనే వివరాలను మాత్రం పోలీసులు వెల్లడించలేదు.
మే 28న కనిపించకుండాపోయిన నితీషా కోసం బంధువులు, స్నేహితుల ఇండ్లలోనూ వాకబుచేసినా ఆచూకీ లభించలేదు. దాంతో స్నేహితులు స్థానిక పోలీస్స్టేషన్లో మే 30న ఫిర్యాదుచేశారు. అమెరికాలో ఇటీవల భారత విద్యార్థులు అదృశ్యమవుతున్న కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. నితీషా క్షేమంగా ఉన్నట్టు గుర్తించినట్టు బుధవారం వెల్లడించారు.