సిలికాన్ వ్యాలీ, ఆగస్టు 29: అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో మైక్రోసాఫ్ట్ క్యాంపస్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న ప్రవాస భారతీయుడు ప్రతీక్ పాండే(35) మృతి చెందారు. ఆగస్టు 19న ఆఫీస్ లోకి ప్రవేశించిన ఆయన, మరుసటి రోజు తెల్లవారేసరికి విగత జీవిగా పడి ఉండటం అందరినీ షాక్‌కు గురి చేసింది. పాండే మృతిపై ఆయన సన్నిహితులు, మిత్రులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున స్పందించారు.
మృతదేహాన్ని భారత్‌కు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. పాండే మృతికి సంబంధించి అనుమానాస్పద విషయాలేవీ గుర్తించలేదని మౌంటెన్ వ్యూ పోలీసులు తెలిపారు.