సాన్ ఫ్రాన్సిస్కో : కృత్రిమ మేధ(ఏఐ)పై సీనియర్ వైట్‌హౌస్ పాలసీ సలహాదారుగా ఇండియన్ అమెరికన్ శ్రీరామ్ కృష్ణన్‌ను అమెరికా ఎన్నికైన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం నియమించారు. కృష్ణన్ గతంలో మైక్రోసాఫ్ట్, ట్విట్టర్, యాహూ, ఫేస్బుక్, స్నాప్ కంపెనీల్లో పని చేశారు. వైట్‌హౌస్‌లో ఆయన డేవిడ్ ఓ.సాక్స్‌తో కలిసి పనిచేస్తారని ట్రంప్ తెలిపారు. దీనిపై కృష్ణన్ స్పందిస్తూ.. ‘ఏఐపై డేవిడ్ సాక్స్‌తో కలిసి పనిచేస్తూ మన దేశానికి సేవ చేయగలగడాన్ని గౌరవంగా భావిస్తున్నా’ అని అన్నారు. కృష్ణన్ నియామకంపై భారతీయ అమెరికన్ సమాజం హర్షం వ్యక్తం చేసింది.