లండన్, మే 19 : భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలపై బ్రిటన్లోని కశ్మీరీ ప్రొఫెసర్ నిటాషా కౌల్ ‘ఓవర్సీస్ సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా’ (ఓసీఐ)ని భారత హై కమిషన్ రద్దు చేసింది. ‘భారత సార్వభౌమాధికారానికి సంబంధించిన విషయాలపై, భారత సంస్థలను లక్ష్యంగా చేసుకొని వివిధ అంతర్జాతీయ వేదికల్లో, సోషల్ మీడియా వేదికల్లో భారత వ్యతిరేక ప్రసంగాలు,
పాత్రికేయ కార్యకలాపాలకు పాల్పడుతున్నారు’ అని ఆమెకు పంపిన రద్దు పత్రంలో భారత హై కమిషన్ పేర్కొన్నది. యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్మినిష్టర్లో సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ డెమొక్రసీకి డైరెక్టర్గా పనిచేస్తున్న ఆమె, భారత్ తన ఓసీఐని రద్దు చేయటాన్ని తీవ్రంగా ఖండించారు.