అడిలైడ్: ఆస్ట్రేలియాలోని అడిలైడ్‌లో భారత సంతతికి చెందిన గౌరవ్ కుండి అనే యువకుడిపై అక్కడి పోలీసులు ఇటీవల కర్కశంగా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తీవ్ర గాయాలపాలైన గౌరవ్.. చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆస్ట్రేలియా పోలీసుల చర్య జార్జి ఫ్లాయిడ్ ఉదంతాన్ని తలపించింది. అడిలైడ్‌లో ఉండే గౌరవ్ కుండి, అమృత్‌పాల్ కౌర్ దంపతుల మధ్య ఇటీవల చిన్న వాగ్వాదం చోటుచేసుకుంది.
అది గమనించిన పెట్రోలింగ్ పోలీసులు, గృహహింసగా భావించారు. గౌరవ్‌ను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో గౌరవ్‌ను కిందపడేసి, మెడపై మోకాలితో తొక్కిపెట్టడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు.