Akash Bobba | న్యూయార్క్, ఫిబ్రవరి 4: ఆటోమేషన్ సాయంతో అమెరికా ప్రభుత్వ రోజూవారీ కార్యకలాపాల్లో వృథా ఖర్చులు తగ్గించడమే లక్ష్యంగా ఎలాన్ మస్క్ నేతృత్వంలో ఏర్పాటైన డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్షీ (డోజ్)లో భారత సంతతి కుర్రాడికి చోటు దక్కింది. 22 ఏండ్ల ఆకాశ్ బొబ్బ మస్క్ నేతృత్వంలో కీలక బాధ్యతలు నిర్వర్తించనున్నారు.ట్రంప్ సర్కారు డోజ్ కోసం ఆరుగురు ఇంజినీర్లను నియమించుకోగా.. వారందరి వయసు 19-24 ఏండ్ల మధ్యే.
భారత సంతతి కుర్రాడు ఆకాశ్‌కు మస్క్ టీంలో చోటు దక్కడంతో అతని గురించి ఇప్పుడు నెట్టింట చర్చ జరుగుతున్నది. డిలీట్ అయిన ఆకాశ్ లింక్డ్ ఇన్ ప్రకారం.. అతను బెర్కెలీలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో మేనేజ్మెంట్, ఆంత్రప్రెన్యూర్‌షిప్, టెక్నాలజీ (ఎంఈటీ) ప్రోగ్రామ్ చేశారు. మెటా, పలంటీర్ సంస్థల్లో ఇంటర్న్‌షిప్ చేశారు. బ్రిడ్జ్‌వాటర్ అసోసియేట్స్ కంపెనీలో ఏఐ, డాటా ఎనలిటిక్స్, ఫైనాన్షియల్ మోడలింగ్ విభాగంలో కొంతకాలం పనిచేసినట్టు తెలుస్తున్నది. ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్మెంట్లో ఆకాశ్ నిపుణుడు. డోజ్‌కు కొత్త చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా నియమితులైన అమందా స్కేల్స్‌కు అతను నేరుగా రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుందని సమాచారం. వైర్డ్ ప్రకారం… ఆకాశ్‌కు జీఎస్ఏలో అన్ని ఐటీ సిస్టమ్‌లకు యాక్సెస్ ఉన్నట్టు తెలుస్తున్నది.