Indian Origin Student | అమెరికాలో ఉంటున్న భారత సంతతికి చెందిన ఓ విద్యార్థి (Indian Origin Student) కరీబియన్ దేశం (Country in the Caribbean) బహమాస్ (Bahamas)లో మృతి చెందాడు. ఓ హోటల్ బాల్కనీ నుంచి ప్రమాదవశాత్తూ కిందపడి ప్రాణాలు కోల్పోయాడు.
25 ఏళ్ల గౌరవ్ జైసింగ్ (Gaurav Jaisingh) అనే విద్యార్థి మసాచుసెట్స్ (Massachusetts)లోని వాల్తామ్‌లోని బెంట్లీ విశ్వవిద్యాలయంలో (Bentley University) చదువుకుంటున్నాడు. ఈ వారంలోనే అతడి గ్రాడ్యుయేషన్ (Days Before Graduation) కూడా పూర్తికానుంది. ఈ క్రమంలో స్నేహితులతో కలిసి గౌరవ్ సరదాగా బహమాస్ ట్రిప్‌కు వెళ్లాడు. అక్కడ ఓ హోటల్లో బస చేశారు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం అక్కడ తాను బస చేస్తున్న హోటల్ బాల్కనీలో అటూఇటూ తిరుగుతూ.. ప్రమాదవశాత్తూ కిందపడిపోయాడు. ఈ ఘటనలో గౌరవ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. గౌరవ్ మృతిపై బెంట్లీ వర్సిటీ ఎక్స్ వేదికగా సంతాపం తెలిపింది.
Also Read..
Donald Trump | మీరు రాత్రి పూట నిద్రపోతారా..?.. సౌదీ యువరాజుకు అసాధారణ ప్రశ్న వేసిన ట్రంప్
Earthquake | గ్రీస్‌లో భారీ భూకంపం.. ఈజిప్టు, లెబనాన్, ఇజ్రాయెల్, జోర్డాన్‌లోనూ ప్రకంపనలు
Indian Diplomat | భారత దౌత్యవేత్తకు పాక్ సమన్లు.. 24 గంటల్లోగా దేశం విడిచి వెళ్లాలని ఆదేశం