Earthquake | గ్రీస్‌లో భారీ భూకంపం.. ఈజిప్టు, లెబనాన్, ఇజ్రాయెల్, జోర్డాన్‌లోనూ ప్రకంపనలు
యూరోపియన్ దేశమైన గ్రీస్‌లో భారీ భూకంపం (Earthquake) వచ్చింది. బుధవరాం తెల్లవారుజామున 1.51 గంటలకు గ్రీకు ద్వీపం కాసోస్ ప్రాంతంలో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.1గా నమోదైంది.
న్యూఢిల్లీ: యూరోపియన్ దేశమైన గ్రీస్‌లో భారీ భూకంపం (Earthquake) వచ్చింది. బుధవరాం తెల్లవారుజామున 1.51 గంటలకు గ్రీకు ద్వీపం కాసోస్ ప్రాంతంలో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.1గా నమోదైంది. భూ అంతర్భాగంలో 78 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించిందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) తెలిపింది. ఫ్రై పట్టణానికి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని వెల్లడించింది. దీని ప్రభావంతో గ్రీస్ సమీప దేశాలైన కైరో, ఇజ్రాయెల్, ఈజిప్టు, లెబనాన్, తుర్కియే, జోర్డాన్‌లో ప్రకంపణలు చోటుచేసుకున్నాయని చెప్పింది.
గ్రీస్ ప్రధాన భూభాగంతోపాటు గ్రీక్ ద్వీపాలైన క్రెట్, కాసోస్, కార్పథోస్, డోడకేనెస్లో కూడా భూమి కంపించిందని తెలిపింది. దీనివల్ల జరిగిన నష్టానికి సంబంధించి వివరాలేవీ తెలియారాలేదని అధికారులు వెల్లడించారు.
#earthquake M 6.1 CRETE, GREECE pic.twitter.com/G3BdNQlYCW
— SSGEOS (@ssgeos) May 13, 2025
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Cairo
- Earthquake
- Egypt
- Greece
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

