Nimisha Priya : యెమెన్ దేశస్థుడి హత్య కేసులో ఉరి శిక్ష ఖరారైన భారతీయ నర్సు నిమిష ప్రియ (Nimisha Priya)కు ఊరట లభించలేదు. ఇన్నిరోజులు తన వద్ద పెండింగ్‌లో ఉన్న ఆమె క్షమాభిక్ష పిటిషన్‌కు దేశ అధ్యక్షుడు ఆమోదం తెలిపారు. దాంతో, వచ్చే వారం అంటే జూలై 16న నిమిష ఉరికి ఏర్పాట్లు చేస్తున్నారు జైలు అధికారులు. అయితే.. నిమిష క్షమాభిక్ష తిరస్కరణ తదనంతర పరిణామాలను తాము నిషితంగా గమనిస్తున్నామని భారత విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది. నర్స్ కుటుంబ సభ్యులతో టచ్ ఉన్నామని, వాళ్లకు అవసరమైన సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించింది. నిమిష ప్రస్తుతం రాజధాని సనాలోని ఓ జైలులో ఉన్నారు.
నిమిష ప్రియది కేరళలోని పాలక్కాడ్. తల్లిదండ్రులకు అండగా నిలవాలని ఆమె 2008లో యెమెన్‌కు వెళ్లింది. అక్కడ పలు ఆస్పత్రుల్లో నర్సుగా పనిచేసిన ఆమెకు 2014లో ఆ దేశస్థుడు తలాల్ అబ్దో మహది(Talal Abdo Mahdi)తో పరిచయం అయింది. ప్రియా భర్త, ఆమె కూతురు 2014లో ఇండియాకు రిటర్న్ వచ్చారు. కానీ ఉద్యోగం కారణంగా ప్రియా వెనక్కి రాలేకపోయింది. అయితే ఉద్యోగం కోసం మహదితో కలిసి 2015లో క్లినిక్‌ను ఓపెన్ చేసింది.
Nimisha Priya, a nurse from Palakkad who was jailed for murdering a Yemeni national, faces execution on July 16. The public prosecutor in Yemen confirmed the order and handed it over to the prison authorities. To secure her pardon, the deceased’s family has demanded blood money… pic.twitter.com/cFJnKmlXA3
— Onmanorama (@Onmanorama) July 8, 2025
కానీ ఇద్దరి మధ్య కొన్నాళ్లకు గొడవ మొదలైంది. దాంతో ఆమె అతడిపై కేసు పెట్టింది. జైలు నుంచి విడుదలైన తర్వాత మహది ఆమెను భయపెట్టాడు. నిమిష పాస్‌పోర్టును లాగేసుకున్నాడు. దీంతో ఇద్దరి మధ్య 2017 జూలై 25న గొడవ సమయంలో మహదిని ఆమె ఆత్మరక్షణలో భాగంగా అనుకోకుండా చంపేసింది. తన కుమార్తె విడుదల గురించి మహది కుటుంబంతో మాట్లాడి వాళ్ల కుటుంబానికి డబ్బులు చెల్లించేందుకు ప్రియా తల్లి సిద్దంగా ఉన్నానని చెప్పింది. కానీ యెమెన్ సుప్రీంకోర్టు మాత్రం ఆ అభ్యర్థనను తిరస్కరించింది.