Iran war | రియాద్‌పై ఇరాన్ మిస్సైల్ దాడి.. భారతీయుడు మృతి.. 6కు చేరిన భారతీయ మృతుల సంఖ్య
Iran war : సౌదీ అరేబియాలోని రియాద్ పట్టణంపై ఇరాన్ జరిపిన మిస్సైల్ దాడిలో భారతీయుడు మరణించాడు. ఈ విషయాన్ని సౌదీ అరేబియాలోని భారత రాయబార కార్యాలయం శుక్రవారం ధృవీకరించింది.
Iran war : గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. సౌదీ అరేబియాలోని రియాద్ పట్టణంపై ఇరాన్ జరిపిన మిస్సైల్ దాడిలో భారతీయుడు మరణించాడు. ఈ విషయాన్ని సౌదీ అరేబియాలోని భారత రాయబార కార్యాలయం శుక్రవారం ధృవీకరించింది. ఈ నెల 18న రియాద్ పట్టణంపై ఇరాన్ మిస్సైల్ దాడి చేసింది. ఈ దాడిలో ఒక భారతీయుడు మరణించాడని తమకు గురువారం రాత్రి సమాచారం అందినట్లు ఇండియన్ ఎంబసీ ప్రకటించింది.
ఇటీవల ఇరాన్ దాడుల్లో గల్ఫ్ దేశాల్లో మరణించిన భారతీయుల సంఖ్య 6కు చేరింది. తాజాగా మరణించిన భారతీయుడికి సంబంధించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించినట్లు రాయబార కార్యాలయం తెలిపింది. ఈ అంశంపై అక్కడి భారత రాయబారి మహాజన్ స్పందించారు. మృతుడి కుటుంబానికి సానుభూతి తెలుపుతున్నామని, వారికి తగినంత సాయం అందిస్తామని, మృతదేహాన్ని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తామని ప్రకటించారు. అలాగే ఇటీవల ఎమ్టీ సేఫ్ సీ విష్ణు ఆయిల్ ట్యాంకర్ నుంచి 15 మంది భారత సిబ్బందిని రక్షించామని, వారు శుక్రవారం ఇండియా చేరుకుంటారని కూడా ఆయన తెలిపారు. మరోవైపు గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా కువైట్‌లోని కీలక చమురు క్షేత్రాలపై ఇరాన్ దాడి చేసింది.
అక్కడి మినా అల్ అహ్మదీ రిఫైనరీపై ఇరాన్ డ్రోన్ దాడి చేసింది. ఈ పేలుడుకు భారీగా మంటలు వ్యాపించాయి. ఈ దాడుల్లో ఎలాంటి ప్రాణనష్టం లేదని కువైట్ పెట్రోలియం కార్పొరేషన్ అధికారులు వెల్లడించారు. ఇటీవల గల్ఫ్ దేశాల్లోని చమురు కేంద్రాల్ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ చేస్తున్న దాడులతో భారీ నష్టమే జరిగింది. ముఖ్యంగా ఆయా దేశాల్లో చమురు ఉత్పత్తి తిరిగి సాధారణ స్థితికి చేరుకోవడానికి ఆరు నెలల సమయం పడుతుందని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ చీఫ్ ఫాతి బిరోల్ అన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mahesh Kumar Goud | చామల ఎవడు.. కమిటీలు ప్రకటించే అధికారం ఆయనకెక్కడిది?.. మహేశ్‌కుమార్ గౌడ్ ఆగ్రహం
Kazipet Land Scam | 4 వేల కోట్ల భూమికి ‘బిగ్’ ఎసరు.. కాజీపేటలో 12.37 ఎకరాల ప్రభుత్వ భూమిపై పంజా
Paddy Procurement | ఎక్కడి ధాన్యం అక్కడే.. వడ్ల కొనుగోలులో సర్కార్ నిర్లక్ష్యం.. కల్లాల్లో కుప్పలు పోసి పడిగాపులు కాస్తున్న రైతన్నలు
Revanth Reddy | కాళేశ్వరం మూడో టీఎంసీపై తొందరొద్దు.. అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి హెచ్చరిక
Horoscope | 11-11-2026 బుధవారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

