Emirates Draw | దుబాయ్: తమిళనాడుకు చెందిన మాగేష్ కుమార్ నటరాజన్‌ను శుక్రవారం అదృష్టదేవత వరించింది. ఎమిరేట్స్ డ్రాలో ఫాస్ట్5 గ్రాండ్ ప్రైజ్ పొందారు. ఈ జాక్‌పాట్ కొట్టిన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు చెందని మొదటి వ్యక్తిగా ఆయన నిలిచారు. బహుమతి కింద ఆయనకు రానున్న 25 ఏండ్లపాటు ప్రతి నెలా దాదాపు రూ.5.6 లక్షలు లభించబోతున్నది.
తమిళనాడులోని అంబూరులో ప్రాజెక్ట్ మేనేజర్‌గా పని చేస్తున్న ఆయన 2019 నుంచి నాలుగేళ్లపాటు సౌదీ అరేబియాలో పని చేయడానికి వెళ్లారు. లాటరీలపై ఆసక్తి ఏర్పడటంతో టికెట్లు కొనేవారు. భారీ బహుమతి లభించిన తర్వాత నటరాజన్ మాట్లాడుతూ, తాను బాల్యం నుంచి చాలా కష్టాలు అనుభవించానని, ఈ సొమ్ముతో తన కుటుంబానికి మంచి భవిష్యత్తు ఇవ్వడంతోపాటు, సమాజంలో అవసరమైనవారికి తన వంతు సహాయం చేస్తానని తెలిపారు.