సిడ్నీ: ఆస్ట్రేలియా పోలీసుల కాల్పుల్లో గాయపడిన భారతీయుడు మృతి చెందాడు. తమిళనాడుకు చెందిన మహమ్మద్ రహమతుల్లా(32) ఆబర్న్ రైల్వే స్టేషన్లో ఓ క్లీనర్‌ను కత్తితో పొడిచాడు. అక్కడికి వచ్చిన పోలీసులను కూడా కత్తితో పొడుస్తానని బెదిరించాడు. దీంతో పోలీసులు అతడిపై కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన రహమతుల్లా దవాఖానలో చికిత్స పొందుతూ మరణించాడు.