న్యూయార్క్ : అమెరికాలోని స్టోర్‌లో ఒక దుండగుడు ఇద్దరు భారతీయులను కాల్చి చంపాడు. ఈ కాల్పుల్లో భారత సంతతికి చెందిన తండ్రీ, కూతురు మరణించారు. వర్జీనియాలోని ఒక కన్వీనియన్స్ స్టోర్‌లో పనిచేస్తున్న భారత్‌కు చెందిన 56 ఏండ్ల ప్రదీప్‌కుమార్ పటేల్, 24 ఏండ్ల అతని కుమార్తెపై ఈ నెల 20న ఒక వ్యక్తి కాల్పులు జరుపగా, తండ్రి అక్కడికక్కడే మృతి చెందగా, కుమార్తె చికిత్స పొందతూ మరణించింది.