వాషింగ్టన్: భారతీయ సంతతికి చెందిన 40 ఏళ్ల డాక్టర్(Indian Doctor) ఒమర్ అయిజాజ్ను అమెరికా పోలీసులు అరెస్టు చేశారు. సుమారు 16 కోట్ల బాండ్‌పై అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతనిపై లైంగిక వేధింపుల కేసులు నమోదు అయ్యాయి. పిల్లలు, మహిళలకు చెందిన నగ్న వీడియోలను తీసినట్లు ఆ డాక్టర్‌పై ఆరోపణలు ఉన్నాయి. అతని వద్ద వందల సంఖ్యలో వీడియోలు, ఇమేజ్‌లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆగస్టు 8వ తేదీన ఒమర్ అయిజాజ్ను అరెస్టు చేశారు.
బాత్రూమ్లు, ఛేంజింగ్ ఏరియాలు, హాస్పిటల్ రూమ్‌లు, ఇంట్లోనూ రహస్య ప్రదేశాల్లో కెమెరాలు పెట్టి.. దుస్తుల్ని మార్చుకునే చిత్రాలను తీసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అతని భార్య కొన్ని అభ్యంతరకర ఫోటోలు, వీడియోలను పోలీసులకు అప్పగించిన తర్వాత అధికారులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. స్పృహలోలేని, నిద్రలో ఉన్న ఆడవారితో సెక్స్ చేసిన సందర్భాలను కూడా వీడియో రికార్డు చేసినట్లు అతనిపై ఆరోపణలు ఉన్నాయి.
మిచిగన్ రాష్ట్రంలోని ఓక్లాండ్ కౌంటీలో ఉన్న రోచెస్టర్ హిల్స్ ఇంటిలో వేల సంఖ్యలో వీడియోలు గుర్తించినట్లు పోలీసులు చెప్పారు. అయిజాజ్ ఇంట్లో సెర్చ్ చేసిన పోలీసులు .. అక్కడి నుంచి కంప్యూటర్లు, ఫోన్లు, 15 ఎక్స్టర్నల్ డివైస్‌లు స్వాధీనం చేసుకున్నారు. ఓ హార్డ్ డ్రైవ్‌లో సుమారు 13వేల వీడియోలు ఉన్నట్లు గుర్తించారు. క్లౌడ్ స్టోరేజ్‌లోకి కూడా ఆ వీడియోలను అప్లోడ్ చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.