కాబూల్: అఫ్గానిస్థాన్‌లో క్రియాశీలకంగా లేని జలాలాబాద్‌లోని భారత కాన్సులేట్‌లో పనిచేస్తున్న సిబ్బందిపై మంగళవారం దాడి జరిగింది. దౌత్య కార్యాలయానికి చెందిన స్థానిక సిబ్బందిని తీసుకెళ్తున్న వాహనంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ దాడిలో ఒక భారతీయుడు గాయపడ్డాడు.
జలాలాబాద్‌లో ఉన్న భారత దౌత్య కార్యాలయం 2020 నుంచి కార్యకలాపాలు కొనసాగించకున్నా అక్కడ నామమాత్రపు భారత్ సిబ్బంది ఉండి పరిమితంగా విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆ దేశంలోని కాబూల్‌లో మాత్రమే భారత దౌత్య కార్యాలయం పనిచేస్తున్నది. అఫ్గాన్ నుంచి అమెరికా బలగాలు వైదొలగిన తర్వాత 2021లో తాలిబన్లు అధికారం చేపట్టారు.