Shehbaz Sharif | ఇస్లామాబాద్, మే 22: పహల్గాం ఉగ్రదాడి ఘటన దురదృష్టకరమంటూనే పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మళ్లీ భారత్‌పై నోరు పారేసుకున్నారు. 1971 యుద్ధం నాటి ఓటమికి తాము ప్రతీకారం తీర్చుకున్నామంటూ అసంబద్ధ వ్యాఖ్యలు చేశారు. భారత్-పాక్ మధ్య ఇటీవల నెలకొన్న యుద్ధ వాతావరణం ప్రమాదకర మలుపు తీసుకొని ఉండేదన్నారు.
భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌లో ముజఫరాబాద్‌లో మృతి చెందినవారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సాయం చెక్కులను అందజేశారు. పహల్గాం ఘటనపై అంతర్జాతీయ స్థాయి దర్యాప్తునకు తాము సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. ఉగ్రదాడి ఘటనపై దర్యాప్తు జరపాలని కోరినా భారత్ తిరస్కరించిందన్నారు.