Shanghai : చైనా (China) లోని వాణిజ్య నగరం షాంఘై (Shangai) లో అధునాతన కాన్సులేట్ భవనాన్ని భారత్ ప్రారంభించింది. ఆ నగరంలో భారత్ (India) కు చెందిన అనేక వ్యాపార సంస్థలు ఉన్నాయి. అక్కడి భారత వ్యాపారవేత్తల (Indian business people) కు సేవలు అందించడానికి ఇది ఉపయోగపడుతుంది.
చాంగ్నింగ్ జిల్లాలోని ప్రఖ్యాత డానింగ్ సెంటర్లో ఈ కొత్త కాన్సులేట్ ఏర్పాటైంది. 1,436 చదరపు మీటర్ల విస్తీర్ణంలో దీన్ని సిద్ధం చేశారు. మునుపటి భవనంతో పోలిస్తే ఇది రెట్టింపు పరిమాణంలో ఉంటుంది. చైనాలో భారత రాయబారి ప్రదీప్ కుమార్ రావత్ దీన్ని ప్రారంభించారు. సోమవారం నుంచి ఇది సేవలు అందిస్తుందని ఆయన ప్రకటించారు.