ఢాకా: భారత్‌పై బంగ్లాదేశ్ మాజీ ఆర్మీ జనరల్ ఒకరు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్‌ను ముక్కలు ముక్కలుగా చేస్తే తప్ప బంగ్లాదేశ్‌లో పూర్తి శాంతి సాధ్యం కాదని జమాత్ ఎ-ఇస్లామీ మాజీ చీఫ్ గులామ్ అజామ్ కుమారుడు, రిటైర్డ్ బ్రిగేడియర్ జనరల్ అబ్దుల్లాహి అమాన్ ఆజ్మీ పేర్కొన్నారు. ఢాకాలోని నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.