లాహోర్: పాకిస్థాన్ ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్న విషయం తెలిసిందే. ఆ దేశం ఆర్థికంగా బలహీనపడడానికి భారత్ కానీ, అమెరికా కానీ కారణం కాదు అని ఆ దేశ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్(Nawaz Sharif) తెలిపారు. మన విధానాలే మనల్ని ఆర్థిక సంక్షోభం దిశగా తీసుకువెళ్లినట్లు ఆయన చెప్పారు. శక్తివంతమైన సైన్యం వల్లే ఈ పరిస్థితి తలెత్తినట్లు ఆయన ఆరోపించారు. పాకిస్థాన్ ముస్లిం లీగ్ నవాజ్ పార్టీ తరపు టికెట్లు ఆశిస్తున్న వారితో జరిగిన సమావేశంలో నవాజ్ షరీఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
నాలుగోసారి పాక్ ప్రధాని కావాలని నవాజ్ షరీఫ్ భావిస్తున్నారు. అయితే 1993లో, 1999లో, 2017లో తమ ప్రభుత్వాన్ని మిలిటరీనే కూల్చిందన్నారు. పాకిస్థాన్ ఆర్థికంగా వెనుబడి ఉండానికి భారత్ కానీ, అమెరికా కానీ, ఆఫ్ఘనిస్తాన్ కానీ కారణం కాదన్నారు. సైన్యం జోక్యం వల్ల ఈ పరిస్థితి వచ్చిందన్నారు. 2018లో ఎన్నికలను రిగ్గింగ్ చేయడం వల్ల ప్రస్తుతం ప్రజలు ఇబ్బంది పడాల్సి వస్తోందని, దేశ ఆర్థిక స్థితి కూడా క్షీణించినట్లు షరీఫ్ తెలిపారు.