లాహోర్, మే 1: పహల్గాం ఉగ్రదాడిపై భారత్ పలు ఆంక్షలు విధించిన నేపథ్యంలో ప్రతీకార ఆంక్షలకు దిగిన పాకిస్థాన్ తాజాగా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఎఫ్ఎం స్టేషన్లలో భారత్‌కు చెందిన పాటల ప్రసారాన్ని గురువారం నుంచి నిలిపివేసింది. లతా మంగేష్కర్, మహమ్మద్ రఫీ, కిశోర్‌కుమార్, ముకేశ్ లాంటి గాయకులను పాకిస్థానీయులు చాలామంది ఇష్టపడతారు. అందుకే వారు పాడిన పాటలను నిత్యం ఎఫ్ఎం రేడియో స్టేషన్లు ప్రసారం చేస్తుంటాయి.