లాహోర్, మే 23: పాకిస్థాన్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో ఆదేశ విమానాలకు మన గగనతల నిషేధాన్ని వచ్చే నెల 23 వరకు పొడిగించినట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఏప్రిల్ 30న విధించిన ఈ నిషేధం ఈ నెల 23తో ముగిసింది.
దీన్ని పొడిగిస్తూ శుక్రవారం నోటమ్‌ను భారత ప్రభుత్వం జారీ చేసింది. మరోవైపు పాకిస్థాన్ కూడా భారత విమానాలకు తమ గగనతల నిషేధాన్ని వచ్చే నెల 24 వరకు పొడిగించింది. ఈ నిషేధం భారత సైనిక విమానాలకు కూడా వర్తిస్తుందని వివరించింది.