ఢాకా, జూన్ 12: నోబెల్ గ్రహీత, విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ పూర్వీకులకు చెందిన ఎస్టేట్‌ను మంగళవారం బంగ్లాదేశ్‌లో మూకలు ధ్వంసం చేశాయి. అక్కడిఎస్టేట్లోని మ్యూజియంని సందర్శకుల కోసం తెరచి ఉంచుతారు. బంగ్లాదేశీ పౌరుడు షా నవాజ్ మంగళవారం కుటుంబంతో కలసి మ్యూజియం సందర్శనకు వచ్చాడు.
మోటారు సైకిల్ పార్కింగ్ రుసుము విషయంలో నవాజ్‌కు, అక్కడి సిబ్బందికి గొడవ జరిగింది. అతనిపై సిబ్బంది దాడి చేయగా బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ(బీఎన్పీ) స్థానిక నాయకులు అడ్డుపడి ఆడిటోరియంపై దాడి చేశారు. కిటికీలు, తలుపులు, ఫర్నీచర్‌ని ధ్వంసం చేశారు. అక్కడి నిర్వాహకుడిని కూడా చితకబాదారు.