Sheik Hassina | షేక్ హసీనా వల్ల భారత్‌కు ముప్పు.. ఆమెను బంగ్లాకు అప్పగించాలి : తౌహీద్ హుస్సేన్
Sheik Hassina | షేక్ హసీనాకు ఆశ్రయం వల్ల భారత్‌కు ముప్పు ఉందని బంగ్లాదేశ్ ప్రభుత్వ తాత్కాలిక విదేశీ వ్యవహారాల సలహాదారు తౌహీద్ హుస్సేన్ కీలక వ్యాఖ్యలు చేశారు. షేక్ హసీనాకు ఆశ్రయంతో భారత్, బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
Sheik Hassina : షేక్ హసీనాకు ఆశ్రయం వల్ల భారత్‌కు ముప్పు ఉందని బంగ్లాదేశ్ ప్రభుత్వ తాత్కాలిక విదేశీ వ్యవహారాల సలహాదారు తౌహీద్ హుస్సేన్ కీలక వ్యాఖ్యలు చేశారు. షేక్ హసీనాకు ఆశ్రయంతో భారత్, బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. షేక్ హసీనా ప్రస్తుతం ఢిల్లీలో ఉందని.. బంగ్లా హోంశాఖ, న్యాయ శాఖ నుంచి ఏదైనా అభ్యర్థన వస్తే హసీనాను తిరిగి బంగ్లాదేశ్‌కు పంపాలని తాము భారత ప్రభుత్వాన్ని కోరాల్సి ఉంటుందని ఆయన చెప్పారు.
బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ జనరల్ సెక్రటరీ మీర్జా ఫక్రుల్ ఇస్లాం ఆలంగీర్ మాట్లాడుతూ.. హసీనా భారత్‌లోనే ఉంటే రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు చెడిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. బంగ్లాదేశ్ నుంచి భారత్ భద్రతకు ముప్పు కలిగించే వాటిని అనుమతించబోమని ఆలంగీర్ స్పష్టం చేశారు. మైనారిటీల భద్రత బంగ్లాదేశ్ అంతర్గత విషయమని.. హిందువులపై దాడులు జరుగుతున్నాయనే వార్తలు తప్పని తెలిపారు.
ఇదిలావుంటే బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ వ్యతిరేక నిరసనల సందర్భంగా ఇద్దరు బీఎన్పీ కార్యకర్తలతో సహా ముగ్గురు వ్యక్తులను చంపినందుకు సంబంధించి మాజీ ప్రధాని షేక్ హసీనాపై రెండు కొత్త హత్య కేసులు నమోదయ్యాయి. శుక్రవారం ఢాకా కోర్టులో ఈ కేసులు దాఖలయ్యాయి. కాగా బంగ్లాదేశ్‌లో హింస చెలరేగడంతో ఆగస్టు 5న షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి భారత్‌కు వచ్చారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

