Income tax | ఒమన్‌లో ఇక ఇన్కమ్ ట్యాక్స్.. ఆదాయంపై పన్ను వేయబోతున్న తొలి గల్ఫ్ దేశం
Income tax | ఒమన్ (Oman) దేశం ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాల కోసం అన్వేషిస్తోంది. అందులో భాగంగా ఆదాయంపై పన్ను వేయాలనుకుంటోంది. ఇన్కమ్ ట్యాక్స్ (Income Tax) ను 2028 నుంచి అమల్లోకి తీసుకురావాలని చూస్తోంది.
Income tax : ఒమన్ (Oman) దేశం ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాల కోసం అన్వేషిస్తోంది. అందులో భాగంగా ఆదాయంపై పన్ను వేయాలనుకుంటోంది. ఇన్కమ్ ట్యాక్స్ (Income Tax) ను 2028 నుంచి అమల్లోకి తీసుకురావాలని చూస్తోంది. అయితే అధిక సంపాదన ఉన్న వారి నుంచి మాత్రమే ఒమన్ పన్ను వసూలు చేయాలని భావిస్తోంది.
ఏడాదికి 42 వేల రియాల్స్ (అంటే 1.09 లక్ష డాలర్లు) కంటే ఎక్కువ సంపాదించేవారిపై 5 శాతం చొప్పున పన్ను వేయాలని ఒమన్ యోచిస్తోంది. దాంతో పన్ను పరిధిలోకి వచ్చే వారి సంఖ్య 1 శాతంగా ఉండవచ్చునని అంచనా వేస్తోంది. ఇనకమ్ ట్యాక్స్ అమల్లోకి వస్తే ఆదాయంపై పన్ను వేస్తున్న తొలి గల్ఫ్ దేశంగా ఒమన్ నిలువనుంది.
కాగా గల్ఫ్ దేశాలకు ముడిచమురే ప్రధాన ఆదాయ వనరు. గల్ఫ్ కోపరేషన్ కౌన్సిల్ (GCC) లోని ఆరు దేశాలు ఆర్థికంగా పరిపుష్టిగా ఉన్నాయి. అయితే ఈ ఏడాది సౌదీ అరేబియా, బహ్రెయిన్ దేశాలు ద్రవ్యలోటు ఎదుర్కొనే అవకాశం ఉందన్న అంచనాలు వెలువడుతున్నాయి. అంతర్జాతీయంగా శిలాజ ఇంధనాలకు డిమాండ్ తగ్గుతున్నందున దీర్ఘకాలంలో ఆదాయపు పన్ను లాంటి సంస్కరణలు తీసుకురావాల్సిన అవశ్యకత ఉంటుందని ఐఎంఎఫ్ పేర్కొంటోంది.
ఈ నేపథ్యంలో చమురుపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని ఒమన్ భావిస్తోంది. తద్వారా వచ్చే ఆదాయాన్ని సంక్షేమానికి వెచ్చించాలనుకుంటున్నట్లు ఒమన్ ఆర్థిక మంత్రి బిన్ మహ్మద్ అల్ సఖ్రి తాజాగా పేర్కొ్న్నారు. జీసీసీలోని ఇతర దేశాలకు ఒమన్ తీసుకున్న నిర్ణయం ఆదర్శం కావొచ్చని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
ఆయా దేశాలు కూడా క్రమంగా ఆదాయ పన్నువైపు మళ్లే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ప్రస్తుతం గల్ఫ్ దేశాల్లో ఆదాయంపై పన్ను ఉండదన్న కారణంతోనే ఇతర దేశాల్లోని సంపన్న వర్గాలకు చెందిన వారు అక్కడ నివాసాలు ఏర్పరచుకుంటున్నారనడం వాస్తవదూరం కాదు.
Read More >>
ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం.. ఇరాన్లో భారత ఇంజినీర్ మిస్సింగ్
ఆ ఇద్దరికి ఐదు రోజుల ఎన్ఐఏ రిమాండ్
నేను భయపడే రకం కాదు.. బహిష్కరణపై తేజ్ ప్రతాప్ యాదవ్
పాఠశాలకు బాంబు బెదిరింపు.. మెయిల్ పంపిన ఆగంతకుడు
ఆ ఇద్దరినీ జమ్మూ కోర్టులో హాజరుపర్చిన ఎన్ఐఏ
పార్టీ అధ్యక్ష పదవికి మరోసారి లాలూ యాదవ్ నామినేషన్
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

