కాట్మాండు: నేపాల్‌లోని త్రిశూలీ నది పరివాహక ప్రాంతంలో ఉన్న ఓ గ్రామీణ బ్యాంకు నుంచి భారీ మొత్తంలో నగలు, ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బురదతో నిండిన వరద(Nepal Floods) పోటెత్తిన ఘటనలో.. త్రిశూలీ దుంగేలో ఉన్న అగ్రికల్చర్ డెవలప్మెంట్ బ్యాంక్ బ్రాంచ్ ధ్వంసమైంది. వరద ప్రవాహించిన మార్గంలోనే ఆ బ్యాంక్ ఉన్నది. అయితే నేపాల్ పోలీసులు రెస్క్యూ ఆపరేషన్‌ను విజయవంతంగా చేపట్టారు. ఆకస్మిక వరదలతో ధ్వంసమైన ఆ ప్రాంతంలోని బ్యాంకు నుంచి లాకర్లను తీసేందుకు సుమారు 8 గంటల ఆపరేషన్ చేపట్టారు. ఆ బ్యాంకు శిథిలాల కింద ఉన్న లాకర్లను ఎట్టేకేలకు చేజిక్కించుకున్నారు.
వివిధ లాకర్లలో ఉన్న సుమారు 1.5 కోట్ల నగదు, సుమారు 50 కోట్ల విలువైన బంగార ఆభరణాలను బ్యాంకు ఆఫీసర్లు స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు బ్యాంకు లావాదేవీలకు చెందిన సున్నితమైన బ్యాంకింగ్ రికార్డులను కూడా స్వాధీనం చేసుకున్నారు. నగదు, బంగారం, రికార్డులను .. హై సెక్యూర్టీ లొకేషన్‌కు తరలించారు.
జల ప్రళయం వల్ల రసువా జిల్లా నుంచి కొట్టుకువచ్చిన మృతదేహాలను సుమారు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిత్వాన్‌లోని దేవఘడ్ ఫారెస్ట్‌లో గుర్తిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. మార్నింగ్ వాక్కు ఫేమస్ అయిన ఆ అడవి ఇప్పుడు శ్మశాన వాటికగా మారింది.
करिब ८ घण्टाको निरन्तर प्रयास पछि कृषि विकास बैंक, त्रिशूली ढुंगे शाखाबाट करिब रु. १.५ करोड नगद, अनुमानित रु. ५० करोडको सुन तथा महत्वपूर्ण कागजात सुरक्षित स्थानमा सार्दै नेपाल प्रहरी । pic.twitter.com/vAOoOP2VT8
— Nepal Police (@NepalPoliceHQ) August 30, 2026