బీజింగ్ : ఎస్యూవీ డ్రైవర్ మృత్యువు నుంచి తృటిలో తప్పించుకుని క్షేమంగా బయపడిన ఉదంతం చైనాలోని ఝాంగ్దాంగ్ ప్రావిన్స్ జిబో నగరంలో వెలుగుచూసింది. ఇన్‌స్టాగ్రాంలో నౌదిస్ ఈ వీడియోను పోస్ట్ చేయగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బ్రేక్ ఫెయిలైన ట్రక్కు రైల్వే ట్రాక్‌పైకి ఎస్‌యూవీని నెట్టడంతో అక్కడున్న గేట్మెన్ గేట్ ఓపెన్ చేసేందుకు ప్రయత్నించడం ఈ వీడియోలో కనిపిస్తుంది.
అదే సమయంలో రైల్వే ట్రాక్‌పై ఎస్యూవీ ఆగిఉండగా రైలు దూసుకొస్తుంది. ఆపై ట్రక్ వెనక్కు మళ్లగా ఎస్యూవీ డేంజర్ జోన్లో ఉండటం కనిపిస్తుంది. ట్రైన్ దూసుకొస్తుండగా లిప్తపాటులో వాహనాన్నిఎస్యూవీ డ్రైవర్ ట్రాక్స్ బయటకు తీసుకెళ్లడంతో పెను ప్రమాదం తప్పింది. అసలు ట్రక్ డ్రైవర్ ఎందుకు ఎస్‌యూవీని ట్రాక్ పైకి ఢీ కొట్టాడనేది అర్ధం కావడం లేదని ఈ వీడియోను వీక్షించిన నెటిజన్లు ప్రశ్నించారు.