న్యూఢిల్లీ : నడిరోడ్డుపై స్కేటర్ విన్యాసాలను చూసిన నెటిజన్లు అతడి ఓవరాక్షన్‌ను తప్పుపట్టారు. వెనుకా ముందు చూసుకోకుండా స్కేటర్ రోడ్డుపై స్టంట్స్ చేయడంతో ఓ కారు డోరు అతడికి ఢీ కొట్టడంతో స్కేటర్ పేవ్‌మెంట్‌పై పడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Opening the door😡 pic.twitter.com/RUvw1yB6CV
— Tansu YEĞEN (@TansuYegen) December 11, 2022
ఈ ఘటనలో స్కేటర్దే తప్పని నెటిజన్లు తేల్చారు. తన్సు యజెన్ షేర్ చేసిన ఈ వీడియోకు 20 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఈ వైరల్ వీడియోలో స్కేటర్ రోడ్డుపై స్కేటింగ్ చేస్తూ వీడియో తీసుకుంటుడటం కనిపిస్తుంది. ఈ క్రమంలో ఓ ప్రయాణీకుడు కారు డోర్ తెరుస్తుండగా డోర్ స్కేటర్‌కు ఢీకొనడంతో అతడు పేవ్‌మెంట్‌పై పడతాడు.
వేగంగా వస్తున్న స్కేటర్ ఈ ఘటనలో త్రుటిలో ప్రమాదం నుంచి ఎలాంటి గాయాలు కాకుండా తప్పించుకోవడం ఊరట కలిగించింది. పేవ్‌మెంట్‌పై కూర్చున్న మహిళ ఏం జరిగిందో అర్ధం కాక షాక్ తినడం వీడియోలో కనిపిస్తుంది. ఓపెనింగ్ ది డోర్ అని ఈ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు.