మనీల : సోషల్ మీడియాలో వైరల్ వీడియోలు కొన్ని నవ్వులు పూయిస్తే, మరికొన్ని ఆలోచన రేకెత్తించేలా ఉంటాయి. అరుదుగా కొన్ని వీడియోలు హృదయాన్ని తాకుతుంటాయి. ఫిలిప్పీన్స్‌లో స్ధానికులు కొందరు ఓ వృద్ధుడి ఇంటిని భుజాలపైకెత్తుకుని ఆయన ఆత్మీయుల చెంతకు చేర్చిన వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. వృద్ధుడు తన పిల్లలు, మనవళ్లు, మనవరాళ్లతో గడిపేలా ఆయన ఇంటిని స్ధానికులు తమ భుజాలపైకి ఎత్తుకుని కుటుంబాన్ని ఒకచోట చేర్చేందుకు చేసిన ప్రయత్నం అందరి హృదయాలను తాకుతోంది.
గుడ్‌న్యూస్ మూవ్మెంట్ ఈ వైరల్ వీడియోను ఇన్స్టాగ్రాంఓ షేర్ చేసింది. ఈ షార్ట్క్లిప్లో ఏడు ఫీట్ల ఎత్తున్న ఇంటిని పిల్లర్లతో సహా 24 మంది తమ భుజాలపైకి ఎత్తుకుని వెళుతుండటం కనిపిస్తుంది. ఫిలిప్పీన్స్‌లోని జంబొంగ డెల్ నార్టె ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. తన కుమారులు, మనవళ్ల దగ్గర ఉండాలని వృద్ధుడు కోరుకోవడంతో వీరంతా ఆయన ఇంటిని మోసుకెళ్లారు.
గమ్యస్ధానం చేరేందుకు వారికి రెండు గంటల సమయం పట్టింది. దారిపొడవునా వారికి ప్రజలు హర్షధ్వానాలతో ప్రశంసలు కురిపించారు. ఈ క్లిప్‌ను ఆన్లైన్లో షేర్ చేసిన తర్వాత ఇప్పటివరకూ 20 లక్షలకు పైగా వ్యూస్ లభించాయి. ఇతరుల కోసం మనం చేసే పని ఏదైనా అద్భుతమని ఓ యూజర్ ప్రశంసించగా ఇంటిని లిఫ్ట్ చేసి తీసుకెళ్లడం గొప్పవిషయమని మరో యూజర్ రాసుకొచ్చారు.