న్యూయార్క్ : మతిమరుపు వ్యాధి డిమెన్షియాతో బాధపడుతున్న వృద్ధురాలు పెంపుడు కుక్కల పట్ల తన ప్రేమను మరిచిపోలేదు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వైరల్ వీడియోను గుడ్‌న్యూస్ మూవ్మెంట్ ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేసింది. ఈ క్లిప్‌లో ఓ మహిళ వృద్ధురాలికి చిన్న కుక్కను అందిస్తుండటం కనిపించింది.
డిమెన్షియాతో బాధపడుతూ వీల్‌ఛైర్‌లో కూర్చున్న వృద్ధురాలు చిన్న పప్పీని చేతుల్లోకి తీసుకుని ఆప్యాయంగా నిమరడం కనిపించింది. కుక్కల పట్ల తనకున్న ప్రేమను వృద్ధురాలు గుర్తుకుతెచ్చుకుని భావోద్వేగానికి లోనయ్యారు. కుక్కల పట్ల ప్రేమ ఎప్పటికీ చెక్కుచెదరదని ఈ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. ఆన్లైన్లో షేర్ చేసిన అనంతరం ఈ వీడియోను 8 లక్షల మంది వీక్షించారు.
ఈ వీడియోను చూసిన పలువురు యూజర్లు కుక్కల పట్ల వృద్ధురాలి ప్రేమను ప్రశంసించారు. ఆమె చాలా మంచి మహిళని కుక్కని ఆమె కలవడం పట్ల సంతోషంగా ఉన్నానని ఓ యూజర్ కామెంట్ చేశారు. స్వచ్ఛమైన ప్రేమను ఎవరూ మరచిపోలేరని, జంతువులు ఇందుకు చక్కని ఉదాహరణని మరో యూజర్ రాసుకొచ్చారు.