న్యూఢిల్లీ: పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ భారత్తో పూర్తి స్థాయి యుద్ధానికి తహతహలాడుతున్నారని జైలులో శిక్ష అనుభవిస్తున్న పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ముగ్గురు సోదరీమణులలో ఒకరైన అలీమా ఖాన్ ఆరోపించారు. ఇమ్రాన్ ఖాన్ను స్వచ్ఛమైన ఉదారవాదిగా పేర్కొన్న ఆమె, అసిమ్ మునీర్ ఇస్లామిక్ ఛాందసవాదిగా, తీవ్రవాదిలా వ్యవహరిస్తున్నారని పేర్కొంది.