ఇస్లామాబాద్: భూ కుంభకోణం కేసులో పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్కు 14 ఏండ్ల జైలు శిక్ష, ఆయన సతీమణికి ఏడేండ్ల కారాగార శిక్ష పడింది.
అల్-కదిర్ ట్రస్ట్ కేసులో వీరిద్దరూ దోషులని అవినీతి నిరోధక కోర్టు శుక్రవారం తీర్పు చెప్పింది. వీరిద్దరూ ప్రభుత్వానికి 5 వేల కోట్ల పాకిస్థానీ రూపాయలు నష్టం కలిగించారని నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో 2023 డిసెంబరులో కేసు నమోదు చేసింది.