ఇస్లామాబాద్ : పాక్ జాతీయ అసెంబ్లీలో ఇమ్రాన్‌ఖాన్‌పై శనివారం అర్ధరాత్రి జరిగిన ఓటింగ్ జరిగింది. 174 మంది సభ్యులు అవిశ్వాసానికి మద్దతుగా ఓటు వేయడంతో ఇమ్రాన్ పదవీచ్యుతుడయ్యాడు. అవిశ్వాస తీర్మానంతో పదవిని కోల్పోయిన తొలి పాక్ ప్రధానిగా ఇమ్రాన్ నిలిచాడు. ఇదిలా ఉండగా.. అవిశ్వాసం తీర్మానంలో ఓటమిపాలైన ఇమ్రాన్ ఖాన్ తర్వాత తొలిసారిగా స్పందించారు. విదేశీ కుట్రకు వ్యతిరేకంగా మళ్లీ స్వాతంత్య్ర పోరాటం మొదలైంటూ ట్వీట్ చేశారు. మూడు సంవత్సరాల ఏడు నెలల 23 రోజుల పాటు ఇమ్రాన్ పాక్ ప్రధానిగా పని చేశాడు.
పీటీఐ ప్రభుత్వం కూలిపోవడంతో ప్రతిపక్ష ఆధ్వర్యంలో ప్రభుత్వం కొలువుదీరనున్నది. ప్రధానిగా షాబాజ్ ఫరీఫ్ ఎన్నిక లాంఛనం కానున్నది. సోమవారం జాతీయ అసెంబ్లీలో ప్రధాని ఎంపిక కోసం ఓటింగ్ జరుగనున్నది. ఇదిలా ఉండగా.. ఇమ్రాన్ ఖాన్ ఆధ్వర్యంలో పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీ కోర్ కమిటీ సమావేశం జరుగుతుందని సెనేటర్ ఫైసల్ జావేద్ ఖాన్ పేర్కొన్నారు. భేటీలో భవిష్యత్ కార్యాచరణను పార్టీ అధ్యక్షుడు ప్రకటిస్తారని, ఆయనతో కలిసి తాము పోరాడుతామని నేతలు పేర్కొన్నారు.