IMF | ఇస్లామాబాద్ : పాకిస్థాన్‌కు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) భారీ షాక్ ఇచ్చింది. ఉద్దీపన పథకంలో భాగంగా పాక్‌కు తదుపరి విడత నిధులను విడుదల చేసేందుకు కొత్తగా మరో 11 షరతులు విధించింది. రూ.17.6 లక్షల కోట్ల కొత్త బడ్జెట్‌కు పార్లమెంట్ ఆమోదాన్ని పొందాలని,
ఆ బడ్జెట్లో రూ.1.07 లక్షల కోట్లను అభివృద్ధి కార్యక్రమాలకు వెచ్చించాలని, విద్యుత్తు బిల్లులపై రుణ సేవల సర్‌చార్జీని పెంచాలని, మూడేండ్లకు మించి ఉపయోగించిన కార్ల దిగుమతిపై ఆంక్షలను ఎత్తివేయాలని తాజా షరతుల్లో స్పష్టం చేసింది.