Illia Yefimchyk Finch | న్యూఢిల్లీ: ప్రపంచంలోని అత్యంత భారీ బాడీ బిల్డర్‌గా గుర్తింపు పొందిన ఇల్లియా ‘గోలెమ్’ యెఫించిక్ (36) గుండెపోటుతో మరణించారు. ఆయనను ‘ది మ్యుటెంట్’ అని ముద్దుగా పిలుస్తారు. 6 అడుగుల ఎత్తు, 340 పౌండ్ల బరువు గల ఆయన ప్రపంచంలో అత్యంత భయంకరమైన బాడీ బిల్డర్(బాహుబలుడి)గా పేరు సంపాదించినప్పటికీ ఎన్నడూ ఏ పోటీల్లోనూ పాల్గొనలేదు.
ఆయన సతీమణి అన్నా మాట్లాడుతూ.. ఈ నెల 6న ఆయన గుండె చాలా వేగంగా కొట్టుకుందని, అంబులెన్స్ వచ్చే లోపల ఆయన ఛాతీపై ఒత్తి, ప్రాణాలను కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ మరణించారని చెప్పారు. యెఫించిక్ కండలు 25 అంగుళాల చుట్టుకొలత కలిగి ఉండేవి. ఆయన రోజుకు 16,500 క్యాలరీల ఆహారాన్ని తీసుకునేవారు.