వాషింగ్టన్: విరామం లేకుండా గత మూడేండ్ల నుంచి ఉక్రెయిన్‌పై రష్యా కొనసాగిస్తున్న యుద్ధంపై అమెరికా అధినేత డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రానున్న 50 రోజులలో ఉక్రెయిన్‌తో కాల్పుల విరమణకు అధ్యక్షుడు పుతిన్ అంగీకరించకపోతే రష్యాపై భారీగా టారిఫ్‌లు విధిస్తానని సోమవారం హెచ్చరించారు. ‘50 రోజుల్లో ఒప్పందం కుదరకపోతే.. మేము సెకండరీ టారిఫ్‌లను అమలు చేయబోతున్నాం.
అవి 100 శాతం ఉంటాయి’ అని వైట్ హౌస్‌లో మీడియా సమావేశంలో పేర్కొన్నారు. కాగా, ఉక్రెయిన్‌పై యుద్ధం విషయంలో పుతిన్ వైఖరిపై ట్రంప్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అందుకే రష్యా క్షిపణి దాడులను ఎదుర్కోవడానికి ఉక్రెయిన్‌కు పేట్రియాట్ గగనతల రక్షణ వ్యవస్థను అందజేస్తామని అంతకు ముందు ప్రకటించారు.